Tuesday, 21 July 2009

కీరదోస అందానికి, ఆరోగ్యానికి, కేశ సంరక్షణ


కెలొరీలు, నీరు శాతం తక్కువగా ఉండే కీరదోస అందానికి, ఆరోగ్యానికి, కేశ సంరక్షణకూ చక్కగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యం
కీరదోసలో ఖనిజలవణాలు ఎక్కువ. సలాడ్‌గానే కాదు.. రసంరూపంలోనూ దీన్ని తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడే వారికి ఇదెంతో మేలు చేస్తుంది.

కీరదోసలో విటమిన్‌ సి, పీచు, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తాయి. అవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

అందం!
* కీరదోస తురుమును ముఖానికి రాసుకుంటే చర్మంపై జిడ్డు పోతుంది. మొటిమలు, నల్లమచ్చలు దూరమవుతాయి.
* కీరదోస రసానికి నిమ్మరసం, రోజ్‌వాటర్‌, కలిపి ముఖానికి రాసుకుంటే, చర్మానికి నిగారింపు వస్తుంది.
* రెండు చెంచాల కీరరసానికి చెంచా పాలు, రోజ్‌వాటర్‌ చేర్చి.. ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే, మృతచర్మం తొలగిపోతుంది.

కేశసంరక్షణ
* వారానికోసారి కీర, క్యారెట్‌ రసాలను తలకు రాసుకుంటే, జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
* శిరోజాలు చిక్కుపడుతున్నాయా? గుడ్డులోని తెల్లసొనకు రెండు చెంచాల ఆలివ్‌నూనె, కొద్దిగా కీరగుజ్జును కలిపి కుదుళ్లకు పట్టించి, అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment